Breaking News

సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్లో…

కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ పోటీలు రేపు ప్రారంభం అవుతున్నందున…

గ్రౌండ్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన…

ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్, నాయకులు…

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రికొత్తగూడెంజిల్లాకొత్తగూడెం ఏరియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కో ల్ ఇండియా లెవెల్ కబడ్డీ పోటీలు నవంబర్ 28 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు జరగనున్నాయి, రేపు ప్రారంభం కానున్న సందర్భంగా అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు గ్రౌండ్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం జరిగింది, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ పోటీలు మన కొత్తగూడెం ఏరియాలో జరుగుతున్న సందర్భంగా అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, క్రీడాకారులు, మరియు ఏరియాలో ఉన్న ప్రజలు ఉత్సాహంగా కుటుంబ సమేతంగా కబడ్డీ పోటీలను తిలకించవలసిందిగా కోరడమైనది, కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ పోటీలు కొత్తగూడెం ఏరియాలో నిర్వహించడం పట్ల క్రీడాకారులు, ఉద్యోగులు నాయకులు, కార్యకర్తల, హర్షం వ్యక్తం చేశారు, కొత్తగూడెం ఏరియా ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా ఈ యొక్క కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ పోటీలను తిలకించాల్సిందిగా అందర్నీ కోరడమైనది, ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, అధికారులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ భీముడు, జనరల్ కెప్టెన్ వెంకటేశ్వర్లు, ఐఎన్టియుసి నాయకులు, ఎం.కొమురయ్య, గులాం గౌస్, క్రీడాకారులు, నాయకులు కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.