Breaking News

బంగారం ఇస్తానని చెప్పి, ప్రజలను మోసం చేస్తున్న భార్యాభర్తలు అరెస్ట్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

అతి తక్కువ ధరలకు బంగారం ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న భార్య భర్తలను ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ. కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ.. పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన సింగపురం గౌరమ్మ ఆమె భర్త సింగపురం వెంకటయ్య మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి వారికి బంగారం దొరికిందని వాళ్లకు కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు అందులో కొంత బంగారం ఇస్తానని ప్రజలను నమ్మించి, వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజల ను మోసం చేస్తున్నారని. వీరిపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. వీరు బొమ్మగాని పద్మ వద్ద 4 లక్షల 74 వేల రూ.లు, మంద రజిత వద్ద 6 లక్షల 7 వేల రూ.లు, గాదం జయ వద్ద 5 లక్షల 93100 రూ. లు జఫర్గడ్ మండలం కోణాచలం కు సంబంధించిన సుమారు నలుగురు మహిళల వద్ద సుమారు 15 లక్షల వరకు బంగారం ఇస్తామని.. ఇదేవిధంగా మోసం చేశారని, గూడూరుకు చెందిన మంద రజిత ఫిర్యాదు మేరకు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. ఎవరైనా ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో అక్రమంగా బంగారం దొరికిందని, ప్రజలను నమ్మించి మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు.

జమ్మికుంట అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ