మన ప్రగతి న్యూస్/ వరంగల్
తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ జూనియర్ బాలికల టోర్నమెంట్ లో పాల్గొనే వరంగల్ జిల్లా బాలికల జట్టు శిక్షణ తీసుకుంటున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించి కరీమాబాద్ మున్నురుకాపు కమ్యునిటి హల్ లో నిర్వహించిన కార్యక్రమoలో క్రీడాకారిణులకు పండ్లు, గుడ్లను అందజేసిన వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్సార్ యూనివర్సిటీ వరంగల్ డాక్టర్,,పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా డాక్టర్,,పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డిసెంబర్ 2,3,4వ తేదీలలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ జూనియర్ బాలికల టోర్నమెంట్ లో వరంగల్ జిల్లా బాలికల జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి వరంగల్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే విధంగా విజయం సాధించాలని క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీమాబాద్ మున్నూరుకాపు సంగం పెద్దలను క్రీడాకారులకు క్రీడా దుస్తులు మరియు మ్యాట్ షూస్ అందజేయాలని కోరడం జరిగింది డాక్టర్,,పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ కోరికను మన్నించి కరీమాబాదు మున్నూరుకాపు సంఘం పెద్దలు క్రీడాకారులకు క్రీడా దుస్తులు మ్యాట్ షూస్ మరియు ఇతర వసతులు అందిస్తామని తెలిపారు… ఈ యొక్క కార్యక్రమంలో కరీమాబాద్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తోట రమేష్, ప్రధాన కార్యదర్శి లక్కాకుల శ్యామ్, ఉపాధ్యక్షులు బొల్లం ప్రతాప్ , డివిజన్ అధ్యక్షులు కస్తూరి రాజు, కబడ్డీ బాలికల క్యాంప్ నిర్వహకులు, వరంగల్ జిల్లా కబడ్డీ సంఘం సహాయ కార్యదర్శి అక్తర్, కబడ్డీ కోచ్ యాట రవికుమార్ , సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు శ్రావణ్ మరియు కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.

