Breaking News

గ్రామ పార్టీ నాయకుల నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యే దొంతి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట,ఖానాపురం మండలాలలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను గ్రామ పెద్దలు,స్థానిక నాయకులు కలిసి చర్చించి ఖరారు చేయాలి.
ఎక్కువ మంది పోటీదారులు ఉన్నా,అందరినీ కూర్చోబెట్టి గ్రామాభివృద్ధి సామర్థ్యం,ప్రజల ఆశీస్సులు,రిజర్వేషన్‌లను పరిగణలోకి తీసుకుని ఉత్తమ అభ్యర్థిని సర్పంచ్‌గా ఖరారు చేయండి.అదే విధంగా డిసెంబర్ 5న నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయనున్నారని,సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.నర్సంపేట నుండి వరంగల్ వరకు 4 లైన్ల రహదారికి మరియు మెడికల్ కాలేజీ బిల్డింగ్,ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం శంకుస్థాపన, దుగ్గొండి మండలం తొగ్గరాయి ఆర్ అండ్ బి రోడ్డు నుండి పొనకల్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం కోసం కూడా శంకుస్థాపన చేయనున్నారని వీటితో పాటు పాఖాల చెరువు ఆయకట్టు మరమ్మత్తులు మరియు కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని అన్నారు.గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం కొరకు మండలాల వారీగా ఇంచార్జీలను కూడా నియమించామని,అందరూ సమిష్టిగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..