Breaking News

రైతుపై ఎలుగుబంటి దాడితీవ్రంగా గాయపడిన రైతు నారాయణభయాందోళనలో ప్రజలు

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి:

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

వ్యవసాయ బావి వద్దకు వెళ్ళుచున్న రైతుపై తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆదివారం మండలంలోని అయ్యంగారి పల్లి గ్రామ శివారు రేగులగడ్డ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం రేగులగడ్డకు చెందిన రైతు ముస్కు నారాయణ వ్యవసాయ భావి వద్దకు వెళ్ళుచున్నాడని తెలిపారు. వ్యవసాయ బావి పరిసర ప్రాంతాల్లో మాటువేసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో తల పై భాగంలో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన నారాయణ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించామని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తూ ఉండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఎలుగుబంటిని పట్టుకోవాలని రైతులు కోరారు.