Breaking News

డాక్టరేట్ సాధించిన రాజశేఖర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన నునావత్ లలిత రాజు దంపతుల కుమారుడు నునావత్ రాజశేఖర్ డాక్టరేట్ సాధించాడు. రాజశేఖర్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ అనలైటికల్ మెతడ్స్ ఫర్ ది క్వాంటిఫికేషన్ ఆఫ్ సింథటిక్ అనలాగ్స్ విజ్., ఇంప్యూరిటి ప్రొఫైలింగ్ ఇన్ హెర్బల్ ఫార్ములేషన్స్” అనే అంశంపై చేసిన పరిశోధనకు జె.యస్.యస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మైసూరు, ఫార్మసూటికల్ అనాలసిస్ విభాగంలో డాక్టరేట్ ను ప్రధానం చేసింది. జె.యస్.యస్ కళాశాలలోని ప్రొఫెసర్ డా కృష్ణవేణి నాగప్పన్ ఆధ్వర్యంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో గా ఆయన తన పరిశోధనలు చేసారు. హెర్బల్ అండ్ డైటరీ ప్రోడక్ట్స్ కల్తీలో వాడబడే హానికర రసాయనాలను గుర్తించే విధానం, వాటి మోతాదును కనుగొనే విధానాన్ని రాజశేఖర్ అభివృద్ధి చేసారు. రాజశేఖర్ వ్రాసిన ఆర్టికల్స్ అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. డాక్టరేట్ పొందినందుకు రాజశేఖర్ ను గ్రామస్థులు, మిత్రులు అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం