మన ప్రగతి న్యూస్/పాలకుర్తి:
పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల సారయ్యను నియమిస్తూ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ ఆదివారం నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ పద్మశాలీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోగు చిరంజీవి, శ్రీరామ్ సుధాకర్, దేవసాని కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.