మన ప్రగతి న్యూస్/హనుమకొండ:
ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి బహిరంగసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, సీతక్క,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ .ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమీషనర్ అశ్విని, ములుగు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్,టీపీసీసీ జనరల్ సెక్రటరీ కుచన రవళి, వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.