మన ప్రగతి న్యూస్/ పిట్లం:
పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు పండించిన సోయాను ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
సింగిల్ విండో అధ్యక్షులు హన్మంత్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ,నాయకులు మల్లప్ప పటేల్,చిప్ప మోహన్,శ్యామప్ప,నాగి రెడ్డి, మోగులగౌడ్, అహ్మద్, డాక్టర్ సంజీవ్, పండరి,మొహిద్దిన్, సంతోష్, బస్వరాజ్ దేశాయ్, హన్మాండ్లు,చాంద్ పాషా ,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు