గిరిజనులపై కేసులను ఎత్తివేయాలి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి:
కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో మాజీ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ జిసిసి చైర్మన్ ధారావత్ గాంధీ నాయక్ లు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద గిరిజనుల భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన పేద గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ఖండించారు. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకులు జరుపుల బాలు నాయక్, గుగులోతు పార్వతి, ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ రాజేష్ నాయక్, కొడకండ్ల మాజీ ఎంపీపీ జ్యోతి, ఎస్టీ సెల్ పాలకుర్తి మండల అధ్యక్షుడు ధారావత్ యాకూబ్ నాయక్, బానోతు మహేందర్ నాయక్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, బానోతు రమేష్ నాయక్, లకావత్ నాగరాజు, లాకావత్ వెంకట్, దొంతమల్ల గణేష్, పోషాల వెంకన్న లతోపాటు తదితరులు పాల్గొన్నారు.