Breaking News

72.62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి. జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్/
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72. 62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1531 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే చేయాల్సి ఉండగా నవంబర్ 17 నాటికి మొత్తం 1,39,743 ఇండ్ల సర్వే పూర్తి చేశామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో 1154 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,44,972 ఇండ్లకు గాను ఇప్పటి వరకు 1,02,521 ఇండ్లు, పట్టణ ప్రాంతాలలో 377 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 47,460 ఇండ్లకు 37,222 ఇండ్ల సర్వే పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 70.72 శాతం, పట్టణ ప్రాంతాల్లో 78.43 శాతం, జిల్లా వ్యాప్తంగా 72.62 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన ఇండ్లలో సైతం ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.