Breaking News

నాలుగవ సారి జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్.

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్,తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఇస్లావత్ లచ్చిరాం నాయక్ తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగవసారి కావడం విశేషం.ఇస్లావత్ లచ్చిరాం నాయక్ మహబూబాబాద్ జిల్లా నూతనంగా ఏర్పడినప్పటి నుండి సంఘానికి అందించినటువంటి సేవలను గుర్తించి, సభ్యులు తిరిగి వారినే అధ్యక్షులుగా ఎన్నుకున్నారని ప్రాథమిక సభ్యులు,వివిధ మండలాల బాధ్యులు తెలియజేస్తూ నూతన అధ్యక్షులు ఇస్లావత్ లచ్చిరాం నాయక్ కు అభినందనలు తెలిపారు.