వరంగల్ జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలి
లగచర్ల ఘటనను రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర చేసేందుకే దిగజారుడు రాజకీయాలు
ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి:
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలనకు ప్రజలు 2023 ఎన్నికల్లో చరమగీతం పాడడంతో రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సరం ప్రజా పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన విజయోత్సవ సభ నియోజకవర్గ పర్యవేక్షకులు, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో హామీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో పాటు 500 కే గ్యాస్ సిలిండర్, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ వినియోగం, ఏకకాలంలో రైతు రుణమాఫీ, 5 లక్షలు ఉన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడం, రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు కొలువుల పండుగను చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు దిగజారుడు విమర్శలకు పాల్పడ్డారని విమర్శించారు. బిఆర్ఎస్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని, గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే గులాబీ పార్టీ నాయకులు గందరగోళంలో పడ్డారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జనాకర్షణ కాంగ్రెస్ పాలనను చూసి జీర్ణించుకోలేని బిఆర్ఎస్ పార్టీ లగచర్ల ఘటనను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇస్తామని ప్రకటించినప్పటికీ భూసేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అధికారులపై కొంతమంది మూకలు బిఆర్ఎస్ ముసుగులో దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. దాడులకు ఉసిగొలిపిన వ్యక్తులతో పాటు దాడులకు పాల్పడిన ఎంతటి వారి కనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ నాయకులపై జైల్లో రైతులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మార్పు రాలేదని స్పష్టం చేశారు. రాజకీయ మెప్పు కోసమే లగచర్ల ఘటనను వాడుకునేందుకు లగచర్ల బాధితులకు మద్దతు పేరుతో నిరసనలు తెలపడం సిగ్గుచేటని ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. గ్రామాల్లో నేటికీ ఇందిరమ్మ ఇండ్లు దర్శనమిస్తున్నాయని, అదే స్ఫూర్తితో పాలకుర్తి నియోజకవర్గానికి 3500 ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల సహాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, తోటి శాసనసభ్యులు ఏ ఒక్క రోజు విశ్రాంతి తీసుకోకుండా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించి ప్రజల మధ్య ఉంటున్నారని తెలిపారు. నేడు వరంగల్ లో జరిగే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవ సభకు పాలకుర్తి నియోజకవర్గం నుండి 20వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధారావత్ సురేష్ నాయక్, నల్ల శ్రీరాములు, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు జలగం కుమార్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బైరు భార్గవ్, పాలకుర్తి మాజీ సర్పంచులు గంగు కృష్ణమూర్తి, అనుముల మల్లారెడ్డి ,చిలువేరు కృష్ణమూర్తి,వీరమనేని యాకాంతరావు, సేవాదళ్ రాష్ట్ర నాయకులు గుగ్గిళ్ళ ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కమ్మగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గడ్డం యాకసోమయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోనే మహేందర్ రెడ్డి, పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్, బండిపెళ్లి మనమ్మ, మాదాసు హరీష్, గాదెపాక భాస్కర్, బైకానీ ఐలేష్ యాదవ్, మహిళ నాయకురాలు లావుడియా మంజుల నాయక్, నాయకులు ములుగురి యాకయ్య గౌడ్, చిక్కుడు రాములు, బొమ్మగాని భాస్కర్ గౌడ్,బిర్రు సోమేశ్వర్, బెల్లి దేవేందర్ యాదవ్, చిలువేరు సంపత్, పెనుగొండ రమేష్, నలమాస రమేష్ గౌడ్, ఏలూరి యాకన్న, గంగు కృష్ణమూర్తి తో పాటు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.