Breaking News

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలను జయప్రదం చేయాలి 

తహసిల్దార్ శ్రీనివాస్ 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరంగల్లో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ లను జయప్రదం చేయాలని తహసిల్దార్  పి.శ్రీనివాస్ మహిళలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో గల ఐకెపి భవనంలో ఏపీఎం పిట్టల నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో ఎంపీడీవో రాములు తో కలిసి ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు మండలం నుండి తొమ్మిది బస్సుల్లో 450 మంది మహిళలను తరలిస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలకు డ్వాక్రా మహిళలు హాజరుకావాలని సూచించారు. ఒక్కో బస్సుకు ఇన్చార్జిలు ఉంటారని, భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రవీందర్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు గిరగాని సుధ, సీసీలు వెంకటేశ్వర్లు, అనురాధ, శోభ, వెంకన్న, యాదగిరి లతోపాటు గ్రామైక్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.