Breaking News

అధ్వానంగా నిజాంపేట్ – బాచుపల్లి రహదారి

గుంతలు పడి, కంకర తేలిన రోడ్లు

తీవ్ర ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు

పట్టించుకోని అధికారులు

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నిత్యం నగరంలోని ఏదో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దారుణ రహదారులు నగరవాసుల ప్రాణం తీస్తున్నాయి. కొందరు గుంతలను తప్పించబోయి వాహన చక్రాల కింద నలిగిపోతుంటే, మరికొందరు వాహనాలు అదుపుతప్పి గాయాలతో మృత్యువాతపడుతున్నారు. కాలిబాటల్లేక రోడ్డుపై నడుస్తూ ప్రాణాలు కోల్పోతున్నవారూ ఉన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని నిజాంపేట్ క్రాస్ రోడ్ నుండి బాచుపల్లి వెళ్ళే రహదారి అడుగడుగునా గుంతలతో అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

నిజాంపేట్ లోని ప్రధాన రోడ్డు కావడంతో ఈ రోడ్డుపై నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజూ ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుంటాయి. పాడైన రోడ్డుపై దుమ్ము లేస్తూ ప్రయాణం కష్టంగా మారింది. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు వర్షపు నీరంతా రోడ్డు పైనున్న గుంతల్లో నిలబడి ఈ రోడ్డు మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ గుంతల కారణాంగా వాహనాలు తొందరగా పాడవుతున్నాయి. చీకట్లో గుంతలు కన్పించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా పురపాలక అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం పట్టించుకుని రహదారులకు మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఇది మున్సిపాలిటీనా… ఇంకా గ్రామమేనా…

ఈ రోడ్లను చూస్తుంటే నిజాంపేట్ మున్సిపాలిటీనా లేక ఇంకా ఇది నిజాంపేట్ గ్రామమా అన్నట్లు ఉంది. రోడ్ల సమస్యలపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా నాయకులు, అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్న స్థానికులు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

గుంతలు పడి, కంకర తేలిన రోడ్లు

తీవ్ర ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు

పట్టించుకోని అధికారులు

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నిత్యం నగరంలోని ఏదో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దారుణ రహదారులు నగరవాసుల ప్రాణం తీస్తున్నాయి. కొందరు గుంతలను తప్పించబోయి వాహన చక్రాల కింద నలిగిపోతుంటే, మరికొందరు వాహనాలు అదుపుతప్పి గాయాలతో మృత్యువాతపడుతున్నారు. కాలిబాటల్లేక రోడ్డుపై నడుస్తూ ప్రాణాలు కోల్పోతున్నవారూ ఉన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని నిజాంపేట్ క్రాస్ రోడ్ నుండి బాచుపల్లి వెళ్ళే రహదారి అడుగడుగునా గుంతలతో అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిజాంపేట్ లోని ప్రధాన రోడ్డు కావడంతో ఈ రోడ్డుపై నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజూ ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుంటాయి. పాడైన రోడ్డుపై దుమ్ము లేస్తూ ప్రయాణం కష్టంగా మారింది. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు వర్షపు నీరంతా రోడ్డు పైనున్న గుంతల్లో నిలబడి ఈ రోడ్డు మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ గుంతల కారణాంగా వాహనాలు తొందరగా పాడవుతున్నాయి. చీకట్లో గుంతలు కన్పించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా పురపాలక అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం పట్టించుకుని రహదారులకు మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.