బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండు రంగారెడ్డి
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ ఆపద సమయంలోనైనా నేనున్నానంటూ ,భరోసా, ఇస్తూ అటు వృద్ధులకు, వికలాంగులకు, ఆర్దికంగా చితికిపోయిన కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటూ ,చేయీతనిస్తూ సేవాభావం తో మానవ సేవే, మాధవ సేవ అని నమ్మి ఆత్మ విశ్వాసం తో కూడిన నమ్మకాన్ని ప్రజలకు కల్పించి ముందుకు వెళుతున్న బుసిరెడ్డి ఫౌండేషన్ నూతనంగా ,ఆత్మ బంధు, అనే కార్యక్రమం నకు శ్రీ కారం చుట్టింది.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చనిపోయిన గ్రామాల యందు దహనం సంస్కారాల సమయంలో అన్నా పానీయాలు ముట్టుకోరు అలాంటి సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు భోజన సదూపాయాలు కల్పించటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఫౌండేషన్ చైర్మన్ పాండు రంగారెడ్డి తెలిపారు.దహన సంస్కారాల సమయంలో 100 మందికి తగ్గకుండా అన్నా పానీయాలు అందించటం జరుగుతుందని ఈ ఆత్మ బంధు కార్య క్రమం నా యొక్క చిర కాల స్వప్నం అని దీనిని జీవిత కాలం కొనసాగిస్తానని అవసరమైన వారు ఈ క్రింది ఫోన్ నంబరుకు 9581742356 సంప్రదించగలరని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.