మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని రంగయ్య చెరువు ఎర్ర చెరువులతో రిజర్వాయర్ చేయాలని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తండవాసులు తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు
మాట్లాడుతూ రిజర్వాయర్ ఏర్పాటుతో దాదాపు 10 పైగా తండాలు కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉన్నట్టు రంగయ్య చెరువు రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీ బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా వివిధ పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ముంపు గ్రామస్తులు అందరూ నల్లబెల్లి మండలానికి చేరుకొని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఆపాలని ముంపు గ్రామ ప్రజలందరూ కలిసి తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వివిధ వర్గాల చెందిన నాయకులు ముంపు గ్రామస్తులుపాల్గొన్నారు.