మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి;
రైతులు వరి కోసిన తర్వాత పంటల అవశేషాలు కొయ్యలను దహనం చేయకూడదని వాటి వలన సారవంతమైన భూములు పాడైపోతాయని ఇనుగుర్తి ఏవో మహేందర్ రైతులకు సూచించారు. మండలంలోని చిన్న నాగారం గ్రామంలో ఇనుగుర్తి ఏవో బి. మహేందర్ రైతులతో కలిసి సోమవారం పంట పొలాల్లో తిరుగుతూ వారికి సూచనలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట కోసిన వరి పొలాలను సందర్శించి, వరి కొయ్యలను దహనం చేయడం వల్ల భూసారానికి ముప్పు జరుగునని , గాలి కాలుష్యం జరుగుతుంది, నేలలో ఉంటే సహజ పోషకాలు, సూక్ష్మ జీవులు నశిస్తాయని వరి కొయ్యలను కాల్చేయడం ద్వారా పర్యావరణానికి హానితోపాటు భూమిలో ఉండే సహజమైన మిత్ర పురుగులు మరణిస్తాయని క్రమంగా సారాన్ని కోల్పోయి భవిష్యత్తులో పంట దిగుబడి తగ్గుతాయని వివరించారు అంతేగాక భూమిలో ఉండే నత్రజని, ఫాస్పరస్ వంటి పోషకాలు తగ్గుతాయని, కావున రైతు సోదరులు సరైన విధంగా వరి కోయలను బాస్వరం ఎరువు వాడి కుళ్ళించే విధంగా చేసుకోగలరని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి భాస్కర్ రైతులు ఎల్లయ్య కోమలత తదితరులు పాల్గొన్నారు.