హాజరైన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జునసాగర్ నియోజకవర్గం
నందికొండ మున్సిపాలిటీ
హిల్ కాలనీ డౌన్ పార్కు వద్ద
నూతన ముత్యాలమ్మ గుడి కమిటీ ఆహ్వానం మేరకు
నాగార్జునసాగర్ ముత్యాలమ్మ (కాళికాదేవి) అమ్మవారిని నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి సోమవారం ఉదయం దర్శించుకోవటం జరిగింది.
ఎమ్మెల్సీ కోటిరెడ్డి సోమవారం ఉదయం పూట ముత్యాలమ్మ దేవాలయ అర్చకులు డప్పుల చప్పులతో,వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కార్తీక సోమవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆలయం నందు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసి తదనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ని ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. తర్వాత దేవాలయమునకు విచ్చేసిన అశేష భక్త జనానికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో
తిరుమలగిరి సాగర్ మండల తాజా మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రమేష్ జి,డాక్టర్ అజ్మీరా కేశవ్,ఆలయ కమిటీ అధ్యక్షులు మంజుల జనార్ధన్,ప్రధాన కార్యదర్శి మంద రఘువీర్(బిన్నీ), కోశాధికారి సపావత్ చంద్రమౌళి నాయక్,ఆలయ కమిటీ సభ్యులు,బొట్టు శ్రీను, భూషరాజుల (కాటూ) కృష్ణ,స్టీరింగ్ కమిటీ సభ్యులు మర్రిపూడి శ్రీనివాస్,మాయకోటి శంకర్,చెరుపల్లి శ్రీనివాస్(వాసు),నాగార్జున (బ్రో),చెవుల ఎల్లయ్య యాదవ్,వెంకటేశ్వర్లు గౌడ్,మంజుల సత్యనారాయణ,పి.యోహాను,పూజారులు మోహన్ గౌడ్,నారాయణ,భక్తులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.