మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో
నడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. 2030 నాటికి భారత్లో కార్బన ఉద్గారాలను తగ్గించాలనే ప్రయత్నాల్లో దీని రూపకల్పనకు కేంద్రం సంకల్పించింది. త్వరలోనే మరిన్ని హైడ్రోజన్ రైళ్లను
ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.