ఉన్నత చదువులు వదిలి రాజకీయంలోకి ప్రవేశం
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో 6 వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి బైటెక్ చదివే విద్యార్థి జె అఖిల 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉన్నత చదువులు వదిలి మున్సిపల్ పుర పోరులో పోటీకి దిగారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలో వచ్చానని కౌన్సిలర్ అఖిల తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ వారసురాలిగా అడుగుపెడుతూ మొదటి ప్రయత్నంలోనే కౌన్సిలర్ గా విజయం సాధించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. విద్యావంతురాలు ప్రజల సమస్యలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి రాజకీయంగా ఉంటేనే ప్రజలకు సేవ చేయొచ్చు ఏ సమస్య ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లేందుకు ఈ ప్రయత్నం చేసి విజయకేతనం ఎగురావేశారు. తన తండ్రి జనంపల్లి సుభాష్ రాజకీయంగా అనుభవం ఉన్న ఆ వార్డులో ఎస్సి మహిళా రిజర్వుడు రావడంతో రాజకీయాల్లో ఆసక్తి ఉన్న తన కూతురును కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దింపి విజయం సాధించారు. గెలుపే లక్ష్యంగా వార్డులో తిరుగుతూ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి నోట్ చేసుకొని ఓటును అడిగారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

