Breaking News

గీత కార్మికుడు మృతి..

మన ప్రగతి న్యూస్/ వీణవంక:

గీత కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం వీణవంక మండలం కొండ పాక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టు ఐలయ్య (50) రోజు మాదిరిగా తాటిచెట్టు ఎక్కుతుండగా జారి పడి మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు.

జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క