Breaking News

సాంకేతిక పరిజ్ఞానం లేక.. రైతులకు బుకింగ్ కష్టాలు..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్‌లు లేని రైతులకు శాపంగా మారింది.యూరియా కోసం యాప్‌లో ఆన్‌లైన్ బుకింగ్,భూమి వివరాల నమోదు,OTP వంటి సాంకేతిక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.యూరియా దొరక్కపోవడంతో మానకొండూరు శంకరపట్నం మండలాలలో రైతులు రోడ్లపైకి వచ్చి,రాస్తారోకోలు నిర్వహించారు. నిరక్షరాస్యులు చిన్న, సన్నకారు రైతుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా, సరైన అవగాహన లేకుండా ఈ యాప్‌ ను ప్రవేశపెట్టడం వల్ల అన్యాయం జరుగుతోందని,ఈ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. యాప్ వాడకంపై అవగాహన లేకపోవడంతో,నిరక్షరాస్యులైన రైతులు ఇతరులపై లేదా డీలర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాప్ పనితీరులో సాంకేతిక లోపాల వల్ల,యాసంగి, రబీ సీజన్‌లో యూరియా బుక్ చేసుకోవడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. సరైన సమయానికి యూరియా దొరక్కపోవడంతో పంట దిగుబడి తగ్గుతుందనే ఆందోళన రైతులల్లో వ్యక్తమవుతోంది. యాప్ ద్వారా బుకింగ్ జరగకపోవడంతో, కొందరు డీలర్లు అధిక ధరలకు (బ్లాక్ మార్కెటింగ్) యూరియా అమ్ముతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కారును ఢీకొట్టి.. అడ్డువచ్చిన వ్యక్తిపైకి దూసుకెళ్లిన బోలెరో!