మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో శ్రీ సత్యభామ- రుక్మిణి- గోదా సమేత రాజగోపాలస్వామి రథోత్సవము శనివారం నాడు మహా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరింపజేసిన రధములో స్వామి వారి -అమ్మవార్ల వి గ్రహ ఉత్సవ మూర్తులను పండితులు అధిష్టించారు. సన్నాయి మేళాల చప్పుళ్ల తో, మహిళలు -యువతులు కోలాట నృత్యాలు చేస్తుండగా, వీరి మధ్యన ఓ వ్యక్తి కృష్ణుని వేషధారణలో నృత్యం చేస్తుండగా, బాణసంచా పేలుస్తూ స్వామివారి ర ధమును గ్రామ పురవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రజలు మంగళ హా రతుల తో స్వాగతించారు. సాయంత్రం ఆలయంలో జరిగిన చక్రవరి సేవా కార్య క్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని, దీప రాజ్యం చేసి, కట్నాలు సమర్పించారు. దీంతో ఆలయం, ఆలయ ప్రాంగణం భక్తజ నులతో కిటకిటలాడింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతల రామ కృష్ణ, కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, బంధుజనులు పాల్గొన్నారు.

