మన ప్రగతి న్యూస్/ నర్మేట్ట:
నర్మెట్ట మండల పరిధిలోని ఆగపేట గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి గ్రామ ప్రజాప్రతినిధులు ముందడుగు వేశారు. గ్రామంలో నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయి థర్డ్ వైర్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతూ నర్మెట్ట ఎలక్ట్రికల్ ఏఈ రాజు గారికి వినతి పత్రం సమర్పించారు.గ్రామంలో తరచుగా ఎదురవుతున్న వివిధ రకాల విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు, సురక్షితమైన కనెక్షన్ల కొరత వంటి అంశాలను వినతి పత్రంలో ప్రస్తావించారు. గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు ,ఉప సర్పంచ్ సొక్కం అనిల్ కుమార్ వార్డ్ మెంబర్స్ రాజుబోయిన జహంగీర్, గౌరబోయిన కళ్యాణి, రాజు కూకట్ల శ్రీవాణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

