Breaking News

మహా శివరాత్రి జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామికి టి.టి.డి పట్టు వస్త్రాల సమర్పణ

మన ప్రగతి న్యూస్/వేములవాడ

వేములవాడలో మహా శివరాత్రి జాతర సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) అర్చకులు, అధికారులు భీమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఆలయానికి చేరుకున్న టి.టి.డి బృందానికి ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రమాదేవి సమక్షంలో, మేళతాళాల నడుమ టి.టి.డి అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.మహా శివరాత్రి జాతర నేపథ్యంలో ఈ కార్యక్రమం భక్తుల మనసులను ఆకట్టుకుంది.

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..