Breaking News

జనగామ కి విచ్చేసిన చీఫ్ సెక్రటరీ శాంత కుమారి

ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వే మీద రివ్యూ చేసిన చీఫ్ సెక్రటరీ శాంత కుమారి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో : ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి మంగళవారం సాయంత్రం జనగామ జిల్లా కలెక్టరెట్ కు విచ్చేయగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్, జడ్పీ సీఈఓ మాధురి షా లు పూల బొకే తో చీఫ్ సెక్రటరీకి స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వే గురించి వివరాలను కలెక్టర్ ను అడిగి తెలుసుకు న్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సాఫిగా కొనసాగుతుందని చెల్లింపులు కూడా ఎప్పటిక ప్పుడు అయ్యేలా ఓ పి ఎం యస్ లో వివరాలను
నమోదు చేస్తున్నార న్నారు.ఇప్పటి వరకు దొడ్డు రకం ధాన్యం కి 78 కోట్లు, సన్నరకం ధాన్యంకి కోటి రూపాయల వరకు చెల్లించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
అలాగే సమగ్ర సర్వే గురించి కలెక్టర్ వివరిస్తూ ఇప్పటి వరకు జిల్లా లో 93.5 శాతం సర్వే పూర్తి అయ్యిందన్నారు
డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యిందని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తూ సర్వేకు సంబందించి న పూర్తి ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూస్తున్నారని కలెక్టర్ చీఫ్ సెక్రటరీకి వివరించారు
జిల్లా లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, సమగ్ర సర్వే పురోగతి పైన చీఫ్ సెక్రటరీ శాంత కుమారి సంతృప్తి వ్యక్తం చేసారు
అధికారులు చాలా చురుకుగా పని చేస్తున్నారన్నారు
చివరగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చీఫ్ సెక్రటరీకి జ్ఞాపికను అందచేశారు