Breaking News

స్టాల్స్ సందర్శనలో జనగామకు తొలి ప్రాధాన్యత

మన ప్రగతి న్యూస్ /
జనగామ బ్యూరో :
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్బంగా హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సెర్ప్, మెప్మా నుండి వివిధ జిల్లాలకు చెందిన గుర్తింపు పొందిన ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసారు. స్టాల్స్ ఏర్పాటులో భాగంగా జనగామ జిల్లా, జనగామ మండలం, పెంబర్తి గ్రామానికి చెందిన సరస్వతి గ్రామ సంఘం,
చైతన్య యస్ హెచ్ జీ కీ చెందిన
కె.అన్నపూర్ణ పెంబర్తి ఇత్తడి వస్తువులను ప్రదర్శించారు.
స్టాల్స్ సందర్శన లో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామకి చెందిన స్టాల్ వద్ద కు చేరుకొని,
పెంబర్తి బ్రాస్ వస్తువులను
చాలా ఆసక్తి గా తిలకించారు.అనం తరం బ్రాస్ వస్తువుల తయారీని గురించి, బిజినెస్ ను ఎప్పటి నుండి చేస్తున్నారని, ఎంత ఆదాయం వస్తుంది అని అన్నపూర్ణ ని అడిగి తెలుసుకున్నారు. ప్రథమంగా తన స్టాల్ వద్దకు వచ్చి, ముఖ్య మంత్రి వ్యాపారం గూర్చి వాకబ్ చెయ్యడతో అన్నపూర్ణ ఆనందానికి అవధులు లేకుండ పోయాయి.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం