
మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
లింగాల గణపురం మండలంలోని జీడికల్లులో ఈ నెల 19,20,21 తేదీలలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆలయాన్ని సందర్శించారు.
స్వామివారి ఎదు ర్కోలు సందర్భంగా అక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాలను కలెక్టర్ తిలకించారు. బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లను పరిశీలిస్తూ గుట్టపై ఉన్న గుండం ను, స్వామి వారి కళ్యాణం కొరకు చేపట్టిన ఏర్పాట్లను, భక్తుల కోసం నిర్మించిన చలువ పందిళ్లను, త్రాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలను, లైటింగ్ ఏర్పాట్లను, రహదారి మరమ్మత్తులను కలెక్టర్ సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొ న్నారు. నవంబర్
20వ తేదీన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 21వ తేదీన రథోత్సవం ఉంటాయని ఆలయ అర్చకులు వివ రించారు.ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీఓ గోపిరామ్ , దేవాలయ ఈవో వంశీ, ఆలయ అర్చకులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు.