Breaking News

వరంగల్లో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

మన ప్రగతి న్యూస్/ వరంగల్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో నూతంగా ఏర్పాటు చేసిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాళోజి కళాక్షేత్రం ప్రాంగణంలో వర్చువల్ విధానంతో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రి కి పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో నూతనంగా నెలకొల్పబడిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ భవనం నుండి అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఈ నూతన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ తొలి డి.ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సైదులుని నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఎస్పీ సాయి చైతన్య అభినందించారు.
ఈ సందర్బంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ తెలంగాణ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రధాన లక్ష్యమని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ లో నూతనంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యముగా వరంగల్, ఖమ్మం కమిషనరేట్ పరిధితో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలో గంజాయితో ఇతర మత్తు పదార్థాలను నియంత్రణ చేయడంతో పాటు విద్యార్థులకు బాల్యం నుండి మత్తు పదార్థాలపై కల్పించడంటో పాటు, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలు పాల్పడటం ద్వారా జరిగే అనర్ధాలపై విద్యార్థులు, ప్రజలకు అవగహన కల్పించడం జరుగుతుందని.. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్ లో ఒక డి. ఎస్పీ, ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు, ముగ్గురు ఎస్. ఐలు, నాలుగురు హెడ్ కానిస్టేబుళ్ళు, ఏడుగురు కానిస్టేబుళ్ళు పనిచేస్తారని. ఎవరైనా మత్తు పదార్ధాలు విక్రయించిన, వినియోగించిన 1908 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వగలరని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని నార్కోటిక్స్ డైరెక్టర్ తెలిపారు, ఈ కార్యక్రమం ఇన్స్ స్పెక్టరు రవిందర్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.