Breaking News

రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్ రెడ్డికీ శుభాకాంక్షలు తెలిపిన విజయ బాయి

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపికైన కాంగ్రెస్ నాయకుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయ బాయి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ అభివృద్ధికి రాజ్యసభలో సేవలందించాలని ఆకాంక్షించారు. వేం నరేందర్ రెడ్డి ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గీత కార్మికుడికి గాయాలు