మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి
రేపల్లెవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ అజ్మీర సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థాయిలో ఉద్యోగులుగా సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యదర్శి సిహెచ్ రాంప్రసాద్, పాలకసభ్యులు జరపల బాలు, కృష్ణ, స్వాతి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు నిమ్మల నరేంద్ర, తంబళ్ల సబస్టిన్, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, కుమారి, ఆశా కార్యకర్త జరపల సామ్రాజ్యం, రేషన్ డీలర్ నల్లమల నిర్మలతో పాటు పంచాయతీ సిబ్బంది అజ్మీర కిషన్, బందెల కిరణ్, మేడి రాములు, గ్రామస్తులు హాజరయ్యారు. మహిళల సేవలను కొనియాడారు.

