మన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:
గోపాలమిత్ర సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వంగూరి గోవింద్- అనంతలక్ష్మి ల కుమారుడు,
బిఆర్ఎస్ గుండాల మండల యువజన విభాగం సీనియర్ నాయకులు వంగూరి అనిల్- మనస్వి ల వివాహం ఆదివారం హైమావతి ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బూడిద బిక్షమయ్య గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లు హాజరై నూతన వదువరులను నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, ఆత్మకూరు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, బి ఆర్ ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ డి ప్రవీణ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


