మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఓ యువకుడు మున్సిపల్ ఎన్నికల పేరిట సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుని వాటిని కుదువ పెట్టి సుమారు ₹15 లక్షల రూపాయలతో పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కార్లు అవసరమని చెప్పి పలువురు యజమానుల వద్ద నుంచి మొత్తం 8 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆ కార్లను ఇతరుల వద్ద తనఖా పెట్టి డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయినట్లు సమాచారం.ఇదిలా ఉండగా చందుర్తికి చెందిన ఓ కారు యజమానికి తన వాహనంలోని జీపీఎస్ ట్రాకర్ తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కార్లను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

