మన ప్రగతి న్యూస్ /వీణవంక:
వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామంలో సోమవారం ఉదయం 4లకు వృద్ధురాలి మెడలో నుండి బంగారం చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం నార్ల కమలమ్మ 70 ఇంట్లో ఉండగ గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి మెడలో నుండి 3 తులాల బంగారు పుస్తెల తాడు అపహరించారు. అట్టి బంగారు విలువ 80,000 లు ఉంటుంది అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి , వృద్ధురాలి దగ్గర నుండి ఫిర్యాదును తీసుకొని ఆన్ సైట్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.

