మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏన్కూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏన్కూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న మహిళలకు ఎమ్మెల్యే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో సేవలందిస్తున్న మహిళా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అలాగే ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సైకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.మహిళలు సమాజ అభివృద్ధి మరియు గ్రామాల పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, స్థానిక పాలనలో మహిళల పాత్ర మరింత బలోపేతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

