Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

మండలంలోని దస్తగిరి పల్లె గ్రామానికి చెందిన పాతరబోయిన మనోహర్ స్వామి (27 ) సోమవారం రాత్రి కొమ్మాలకు వెళ్తున్న క్రమంలో దుగ్గొండి మండలం తొగర్రాయి మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో వాహనంతో సహా కల్వర్టులో పడిపోయాడు. కల్వర్టులో పడగానే తలకు బలమైన గాయాలు అవడం వలన మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు