Breaking News

అప్పుల బాధ తాళలేక నేతన్న బలవన్మరణం

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట

మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల అంజలి తన భర్త మిర్యాల బాలరాజు వయస్సు 39 సంవత్సరాలు.అతను చేనేత పని చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు.చేనేత పని గురించి 5 సంవత్సరాల క్రితం భువనగిరి లోని 5 స్టార్ ఫైనాన్స్ అనే ఒక ప్రైవేటు కంపని లో మూడు లక్షల యాబై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.ఆ అప్పుకు ప్రతి నెల నెలవారిగా ఈఎంఐ కడుతున్నాడని.గత రెండు నెలల నుండి నేత పని సరిగా నడవక పోవడంతో ఈఎంఐ లు కట్టలేక పోయాడని.దాంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు త్రాగి చనిపోయాడని రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చిందని.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.నాగరాజు తెలిపారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు