Breaking News

సావిత్రి బాయిఫూలే కి నివాళులు అర్పించిన మారిశెట్టి వెంకటేశ్వరరావు!!!

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సావిత్రి బాయి ఫూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమానికి యమ్ ఆర్ పి యస్ మండల అధ్యక్షుడు మాదాసు ఆదాం అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పొంగులేటి చెప్పారంటే”చెప్పిన పని”చేసినట్లే