Breaking News

మాదకద్రవ్యాల వినియోగం సమాజంపై పెను ప్రమాదం

ఎస్సై కొంక అశోక్

మన ప్రగతి న్యూస్ హనుమకొండ జిల్లా ప్రతినిధి :మాదకద్రవ్యాల వినియోగం యువత విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని సమాజంపై పెను ప్రమాదం చూపిస్తుందని దామెర ఎస్సై కొంక అశోక్ అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు పరుస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 లో భాగంగా ఈగల్ ఫోర్స్ తెలంగాణలో భాగంగా పిల్లల భద్రత డ్రగ్స్ నివారణ కార్యక్రమంలో భాగంగా దామెర మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమాల నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఊరుగొండ పాఠశాల విద్యార్థులచే గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ . డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యార్థులు మరియు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం లేదా వినియోగించడం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హెడ్మాస్టర్ సత్యనారాయణ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిల్వ మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సమాజం మొత్తం కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితేనే యువతను రక్షించగలమని తెలిపారు. , యువత తమ సమయాన్ని చదువు, క్రీడలు మరియు మంచి అలవాట్లకు వినియోగించుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోలెపాక శ్రీనివాస్,ఉప సర్పంచ్ నంద్యాల శ్రావణ్ రెడ్డి, నార్కోటిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి, ఆర్ఐ సంపత్, ఎంపీ ఓ రంగాచారి, హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పొంగులేటి చెప్పారంటే”చెప్పిన పని”చేసినట్లే