Breaking News

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగాప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి  

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

పొంగులేటి చెప్పారంటే”చెప్పిన పని”చేసినట్లే

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థిని, విద్యార్థులు, యువతీ యువకులు భాగస్వాములు కావాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో డ్రగ్స్ మహమ్మరిని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మరి అతి ప్రమాదకరమైందని అన్నారు. డ్రగ్స్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. డ్రగ్సును నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అనంతరం రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేయించారు. డ్రగ్స్ ను నివారించడంలో ప్రతి ఒక్కరము భాగస్వాములను అవుతామని ప్రతిజ్ఞ చేయించి డ్రగ్స్ రహిత నియోజకవర్గం తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు దూలం పవన్ కుమార్, యాకూబ్ హుస్సేన్, హైదరాబాద్ నార్కోటిక్ ఈగల్ ఫోర్స్ ఎస్ఐ రంజిత్ రావు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, వైద్యాధికారి ఉష లతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.