యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పి బిక్షపతి రావు
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
డ్రగ్స్ రైతు సమాజమే మన అందరి లక్ష్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పి బిక్షపతిరావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని మండల కేంద్రంతో పాటు రంగాపురం మూడు చెక్కలపల్లి నారక్కపేట గ్రామాల ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో పిల్లల భద్రత. డ్రగ్స్ కు అడ్డుకట్ట అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులతో పాటు గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమం మంగళవారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈగల్ ఫోర్స్ తెలంగాణ డిఎస్పి బిక్షపతి రావు మాట్లాడుతూ 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసున్న బాలబాలికలు టీనేజ్ పేరుతో చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలోని గుర్తింపు తెచ్చుకునే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. క్రీడలతోపాటు మంచి స్నేహ సంబంధాలను మెరుగుపరచుకొని విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే విశాలమైన సమాజంలో లక్ష సాధన వైపు అడుగులు వేసి సుస్థిర స్థానం కల్పించుకోవాలన్నారు. గంజాయి హెయిర్ ఆయిల్ లాంటి మత్తు పదార్థాలు విక్రయాల తోపాటు వాడే వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే 1908 నెంబర్కు సమాచారం అందించి తగు రక్షణ పొందాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ మంచి అలవాట్ల విద్యార్థులు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉజ్వల భవిష్యత్తును ఇలాంటి డ్రగ్స్ కు అలవాటు పడి కేవలం 30 సంవత్సరాల లోపే అనారోగ్యం పాలై మృతి చెందుతున్న యువత వారి తల్లిదండ్రులకు కన్నీటిని మిగులుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నిర్మూలన. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం తోపాటు ప్రతి వ్యక్తి బాధ్యతగా ఒక సైనికుడిలా డ్రగ్స్ రైతు తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఆయా గ్రామాలలో విద్యార్థులకు యువతకు క్రీడా కిట్టులను అందజేశారు. ముందుగా ఆయా గ్రామాలలో విద్యార్థులతోపాటు యువత గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ సీఐ సాయి రమణ స్థానిక ఎస్సై వి. గోవర్ధన్ ప్రభుత్వ వైద్యాధికారి పి.బి ఆచార్య. రెవిన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ,యువత, విద్యార్థులు ,ప్రజాప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు.


