Breaking News

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య:

  • భార్యకు, ప్రియుడికి జీవిత ఖైదు
  • కీసర హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు
  • ⁠నిందితులకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించిన కుషాయిగూడ కోర్టు

మన ప్రగతి న్యూస్ /కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భర్తను కిరాతకంగా అంతం చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో 2019లో నమోదైన ఈ హత్య కేసులో కుషాయిగూడ ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి మంగళవారం తుది తీర్పు వెలువరించారు. కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగించి.. చున్నీతో ఉరివేసి.. కీసర మండలం అహ్మద్‌గూడ ఆర్జీకే కాలనీకి చెందిన బెరా రేణుక (37)కు, అదే ప్రాంతంలో గ్యాస్ లేబర్‌గా పనిచేసే దేవగాడ కిషోర్ (30)తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న భర్త బెరా వసంత్‌ను వదిలించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. 2019 మార్చి 13 రాత్రి వసంత్‌కు అతిగా మద్యం తాగించి, కిషోర్ సహాయంతో అతని కాళ్లు, చేతులు కట్టేసి చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నం విఫలం హత్య అనంతరం, వసంత్ మితిమీరి మద్యం సేవించి మరణించినట్లుగా చిత్రీకరించి పోలీసులను, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, కీసర పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజాం బయటపడింది. నిందితులు రేణుక (ఏ1), కిషోర్ (ఏ2)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువు.. కఠిన శిక్ష
పోలీసులు సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, నిందితులు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది. వీరికి జీవిత ఖైదు శిక్షతో పాటు, ప్రతి నిందితుడికి రూ. 1,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మరియు కోర్టు కానిస్టేబుళ్లను మల్కాజ్గిరి కమిషనర్ అభినందించారు.

సర్పంచ్ తేజవత్ బాబురావు మృతి పట్ల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి