మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:
దామెర మండల కేంద్రం శివారులోని సర్వే నెంబర్ 306/ఏ మరియు బి లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు వెలుస్తు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నప్పటికి అధికారులు అటువైపు కన్నెత్తి కుడా చూడక పోవడం పట్ల ఆంతర్యం ఏమిటని ప్రజల నుండి బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. వ్యవసాయ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిభందనలకు లోబడి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది కానీ ఇందుకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ లేదా కుడా (కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ) అనుమతి లేకుండా కాంపౌండ్ గోడలు కట్టడం వలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండడం తో పాటు వరద లేదా వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వలన వ్యవసాయ భూమి వర్షకాలంలో నీరు నిలిచి పంట మునిగే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ,సదరు రైతుఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేసి వాదనలు జరుగుతున్న ఆధారాలు సంబంధిత పత్రాలు సమర్పించిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం
సహజ నీటి ప్రవాహం ఆగిపోవడం పక్కనున్న పొలాలు నీట మునిగే ప్రమాదం ఉన్నందున గ్రామ పంచాయతీ లేదా కుడా అనుమతి లేకుండా నిర్మాణం చెపట్టిన సదరు వ్యక్తి పై అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణం తొలగించాలని రైతులు ప్రజలు కోరుకుంటూన్నారు. పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి వివరణ కోరగా :అక్రమ కట్టడం కు సంబంధించి రైతు నుండి పిర్యాదు వచ్చింది వాస్తవమే అని కట్టడాలు చేపట్టిన స్థలాన్ని పరుశీలించి సదరు వ్యక్తి ని అడగగా కుడా నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని చెప్పినట్లు తెలిపారు…ఈ విషయం పై కుడా అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు..


