Breaking News

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు…

బాధితురాలికి అండగా నిలిచిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

సర్పంచ్ తేజవత్ బాబురావు మృతి పట్ల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ కు చెందిన దంసలపూడి పద్మ అనే మహిళను తన కొడుకు నాగరాజు ఆస్తి కోసం కొడుతూ తిడుతూ ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బందులు తట్టుకోలేక ఆ మహిళ దిశ ప్రొటెక్షన్ టౌన్ అధ్యక్షురాలు అరుణ ను ఆశ్రయించింది. దిశ ప్రొటెక్షన్ ఫౌండేషన్ చైర్మన్ బీవీ రాజు, ఉపాధ్యక్షులు కళ్యాణి, జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ, జిల్లా జనరల్ సెక్రెటరీ పిట్టల కమలమ్మ సూచనతో టౌన్ అధ్యక్షురాలు బొల్లం అరుణ ఆధ్వర్యంలో బాధిత మహిళ దంసలపూడి పద్మతో మాట్లాడిన సభ్యులు ఆమె సమస్యను తెలుసుకుని సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రమాదేవి ని కలిసి పద్మ న్యాయం జరిగేలా చూడాలని మాట్లాడి బాధితురాలు కొడుకుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మండల ప్రెసిడెంట్ దేవరపల్లి రజిని, జగన్నాధపురం మండల ప్రెసిడెంట్ గడ్డం జ్యోతి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మందకృష్ణ వేణి, దిశా సభ్యురాలు బిందు పాల్గొన్నారు.