Breaking News

సర్పంచ్ తేజవత్ బాబురావు మృతి పట్ల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాత కమలాపురం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేజవత్ బాబురావు అకాల మరణం పట్ల వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు వెళ్తున్న మార్గమధ్యంలో ఈ విషయం తెలిసిన వెంటనే తన ప్రయాణాన్ని వాయిదా వేసి ఖమ్మం ఆస్పత్రికి హుటాహుటిన బయలుదేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తేజవత్ బాబురావు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల నాయకుడని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేసే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉందన్నారు.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఆయన సేవలను గుర్తించి మరోసారి గెలిపించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.అలాంటి ప్రజానాయకుడు అకాల మరణం చెందడం ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు.తేజవత్ బాబురావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సానుభూతి వ్యక్తం చేశారు.

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు…