మొగుళ్లపల్లి మండలంలో విషాదం..
మన ప్రగతి న్యూస్/ మొగుళ్లపల్లి:
జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాలలో శనివారం వ్యవ సాయ బావిలో క్రేన్ సాయంతో పూడికతీస్తుండగా.. ప్రమాదవశాత్తు క్రేను వైరు తెగి, కూలీల పై పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని కొరికిశాలలో వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు కూలీలు కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు(48), బండారి అభిలాష్(16) తో పాటు, పిడిసిల్ల కి చెందిన పైడయ్య (53) లు అక్కడికక్కడే మృతి చెందారు. సుకినే మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.


