Breaking News

గద్దలగూడెం ఏరులో కరెంట్‌ ప్రవహించి 15 గొర్రెల మృతి – పరిశీలించిన డీఈ రమేష్

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం గద్దలగూడెం గ్రామ పరిధిలోని ఏరు వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా నుండి సంచారంగా వచ్చిన గొర్రెల కాపరులు పోతుల చిన్న వెంకటప్ప, జాపురం బాలరాసు తదితరుల గొర్రెలు వాగు వద్ద నీరు తాగడానికి వెళ్లగా కరెంట్‌ ప్రవహించి సుమారు 15 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. స్థానిక రైతులు పొలాలకు నీరు పంపేందుకు ఏర్పాటు చేసిన మోటార్‌లో విద్యుత్ లీకేజీ జరిగి వాగులోకి కరెంట్‌ వెళ్లి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనవసరమైన కాల్ చేస్తూ పోలీస్ వారి టైం వృధా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు