Breaking News

విద్యుత్ షాక్‌తో మహిళా కూలీ మృతి..

  • అనుమానాస్పద మృతిగా తండ్రి ఫిర్యాదు..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి:

విద్యుత్ షాక్ తో మహిళా కూలీ మృతి చెందిన ఘటన.. జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మెడగోని అఖిల (27) పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌ కు గురై మృతి చెందినట్లు ఎస్ఐ. రాజశేఖర్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన తాటికొండ మల్లయ్య కు చెందిన పొలంలో కలుపు పనులు చేయ డానికి అఖిలతో పాటు.. మరో ఐదుగురు మహిళా కూలీలు వెళ్లారు. ఈ సమయంలో పొలం గట్టు పై ఉన్న బోరు పైపుకు అఖిల తాకడంతో విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయి కింద పడిపోయి నట్లు తెలిపారు. అక్కడ ఉన్న మహిళా కూలీలు వెంటనే ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధా రించారు. అయితే తన కుమార్తె అఖిల మృతి అనుమానాస్పదంగా ఉందని మృతురాలి తండ్రి కొము రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ. తెలిపారు. కాగా అఖిలకు పౌనూర్ గ్రామానికి చెందిన మేడగొని శ్యామ్ తో 2024 లో వివాహం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు

అనవసరమైన కాల్ చేస్తూ పోలీస్ వారి టైం వృధా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

(మృతురాలు ఫైల్ ఫోటో)..