Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం! యువకుడు మృతి!!

మన ప్రగతి న్యూస్/మానకొండూరు:

దుబ్బాక; సిద్దిపేట్ _మెదక్ హైవే పై యాక్సిడెంట్

మానకొండూరులోని రాజీవ్ నగర్ కి చెందిన యుండింటి సాయికుమార్ (25) పెద్ద చెరువు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ద్విచక్ర వాహనంపై కరీంనగర్ కు వెళ్తున్న సాయికుమార్ కరీంనగర్ నుండి జమ్మికుంట వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. యుండింటి నరసమ్మ రాజమల్లు దంపతులకు ఏకైక కుమారుడు. తండ్రి మృతి చెందడంతో ఇటీవల సంవత్సరికం జరిగినట్లు స్థానికులు తెలిపారు.స్థానికులు పోలీసులకు 108కి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీలత సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.